Kaizer News

సుప్రీం కోర్టుకు మమతా బెనర్జీ

సుప్రీం కోర్టుకు మమతా బెనర్జీ

· State - Telangana · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో పాటు సంప్రదాయ ‘పువ్వులు–గడ్డి’ గుర్తును ఇరువర్గాలూ ఉపయోగించకూడదని ఈసీ మధ్యంతర నిర్ణయం తీసుకుంది. అనంతరం అక్టోబర్‌ 6న జరగనున్న నందిగ్రామ్‌, రెజీనగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం మమతా వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తును, ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ‘ఎన్వలప్‌’ గుర్తును కేటాయించింది. ఈసీ మధ్యంతర నిర్ణయాన్ని తాను అంగీకరించబోనని మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అసలు పేరు, గుర్తును తిరిగి పొందేందుకు రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయపరంగా పోరాడతానని ప్రకటించిన ఆమె.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీపై హక్కు కోసం రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం పరిశీలిస్తోంది. అక్టోబర్‌ 6న నందిగ్రామ్‌, రెజీనగర్‌లో ఉప ఎన్నికలు జరగనుండటంతో ఈ వివాదంపై తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది

Original source: prabhanews.com
Read more on Kaizer News