ఐ.పోలవరం: ఒక వివాహితపై ఓ కుటుంబం దాడి చేసి కులం పేరుతో దూషించిన ఘటనపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన కమిడి వెంకట సుబ్బలక్ష్మి ఇద్దరు పిల్లలతో స్థానిక బీసీ కాలనీలో ధూళిపూడి చక్రంకు చెందిన భవనంలో ఒక పోర్షన్‌లో అద్దెకు నివసిస్తోంది. అదే భవనంలోని మరో మూడు పోర్షన్లలో ఏడాదిగా పల్లం గ్రామానికి చెందిన దోమ వీరబాబు, అతని తల్లిదండ్రులు, అన్నా తమ్ముళ్లు నివసిస్తున్నారు. వీరబాబు వ్యాపారం నిమిత్తం సుబ్బలక్ష్మి వద్ద దఫదఫాలుగా సుమారు రూ.2.25 లక్షలు వడ్డీకి రుణం తీసుకున్నాడు. అయితే గత రెండు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో గత 16 తేదీ బుధవారం రాత్రి వీరబాబును డబ్బుల కోసం బాధిత మహిళ నిలదీసింది. దీంతో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ కులం పేరుతో దూషించి దుర్భాషలాడారని, అంతటితో ఆగకుండా వీరబాబు, అతని తండ్రి, అతను సోదరుడు స్వామి తన ఇంటి వద్దకు వచ్చి భౌతిక దాడికి పాల్పడి గాయపరిచారని సుబ్బలక్ష్మి పేర్కొంది. అడ్డువచ్చిన తన పిల్లలపై కూడా దాడి చేశారని, గాయాల పాలైన తనను కాపవరపు వీరభద్రరావు ఆటోలో టి.కొత్తపల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారని తెలిపింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.రవీంద్రబాబు తెలిపారు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!