Kaizer News

‘పంచదార్ల’ను వదలని మైనింగ్‌ మాఫియా

‘పంచదార్ల’ను వదలని మైనింగ్‌ మాఫియా

· State - Telangana · sakshi.com

పంచదార్ల కొండ ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రభుత్వం ప్రకటన సాక్షి, అనకాపల్లి: పవిత్ర పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్‌ ఆగడం లేదు. ప్రభుత్వం జీవో జారీ చేసి 48 గంటలు కూడా గడవక ముందే అక్రమార్కులు మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై రెండు నెలలుగా కూటమి నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం.. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడం.. వైఎస్సార్‌సీపీ ఢిల్లీ దాకా ఉద్యమించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తూ జీవో 226 జారీ చేసింది.అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం అక్రమార్కులు లెక్కచేయడం లేదు. జీవో వచ్చిన రెండు రోజుల్లోనే, స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ బంధువు మైనింగ్‌ చేస్తున్న ప్రాంతానికి పక్కనే శనివారం మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టినట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక పార్కు పేరుతో మైనింగ్‌ శాఖ కనీస అనుమతులు కూడా లేకుండా రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా 3 నుంచి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర గ్రావెల్‌ను తవ్వేశారు. ప్రశ్నించిన వారిని లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంపై సాక్షి, వైఎస్సార్‌సీపీ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి జీవో జారీ చేసినా, స్థానిక మాఫియా దానిని ఏ మాత్రం ఖాతరు చేయక పోవడం గమనార్హం. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులు తక్షణం స్పందించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News