Kaizer News

ముగ్గురు కోతుల అల్లరి

ముగ్గురు కోతుల అల్లరి

· Entertainment · ntnews.com

తేజ కొండపల్లి, గణేశ్‌ బొడ్డ, దేవాన్ష్‌, వర్షిక పాశం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ముగ్గురు కోతులు’. కార్తీక్‌ గరిమెళ్ల దర్శకుడు. శోభారాణి గరిమెళ్ల నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ని ఆదివారం మేకర్స్‌ విడుదల చేశారు. ‘ముగ్గురు కోతులు..’ అంటూ సాగే ఈ పాటను జగదీశ్‌ బుసయవలస రాయగా, ఎస్‌.సుహాస్‌ స్వరపరిచారు. చైతన్య గన్నవరపు ఆలపించారు. ముగ్గురు హీరోలూ ఎంజాయ్‌ చేస్తూ ఈ పాటలో కనిపించారు. బ్యాచిలర్‌ జీవితాలను ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. యువతరం మెచ్చే వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రానున్నదని ఈ పాట చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ నోముల, సమర్పణ: జీఎస్‌ఆర్‌ క్రియేషన్స్‌

Original source: ntnews.com
Read more on Kaizer News