Kaizer News

సంఘం సొంత కార్యాలయం వద్దే దీక్ష చేపట్టా

సంఘం సొంత కార్యాలయం వద్దే దీక్ష చేపట్టా

· State - Telangana · prabhanews.com

దీక్షతో దేవాలయానికి ఎటువంటి అప్రతిష్ట ఉండదు ఏకపక్ష నిర్ణయంగా ఏ ఒక్క జెండా కింద దీక్ష చేపట్టలే సమాజం కోసం ఆలోచించే నిర్ణయం తీసుకున్నా ఏపీ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జి భవానిపురం, ఆంధ్రప్రభ : నగరాల సంఘం సొంత కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని నగరాల సంఘం అధ్యక్షులు బాయని బాబ్జి (బాబుజి) పేర్కొన్నారు. గతవారం నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ కోసం బాయిన బాబ్జి ఆమరణ నిరాహార దీక్ష చేసి పెద్దల ప్రమేయంతో విరమించిన విషయం విదితమే. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బుధవారం నగరాల జేఏసీ ఓ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలయ ఆవరణలో అనుమతి లేకుండా ఏకపక్షంగా ఓ పార్టీ జెండా కింద నిరాహార దీక్ష చేపట్టి ఆలయ ప్రతిష్టను, నగరాల ఐక్యతను దిగజార్చే విధంగా ఉందని ఆరోపించారని ఆవేదన వ్యక్తపరిచారు. కొత్తపేట రామాలయం ఎదురుగా ఏపీ నగరాల సంఘం ప్రాంగణంలో సభ్యుల ఆమోదంతో తాను నిరాహార దీక్ష చేపట్టానని, ఆ ప్రాంగణం నగరాల సంఘం సొంత కార్యాలయం అని పేర్కొన్నారు. గతంలో ఆలయానికి నగరాల సంఘం కొంత మంచి మొత్తాన్ని విరాళంగా అందించి ఆలయం ఎదురు ఉన్న రెండో అంతస్తులో కార్యాలయాన్ని పొందామని ,ఆ చోటే ఏపీ నగరాల సంఘం కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కాబట్టి ఇతరుల అనుమతి పొందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.తన ఆమరణ నిరాహార దీక్ష అనంతరం ముస్లిం మైనారిటీ ప్రముఖులు,మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ అకస్మాత్తుగా ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన విషయాని గుర్తు చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ముస్లింల ఆధిపత్యం గురించి ఈ తరుణంలో మాట్లాడటం, పోరాటం చేయడం ఎందుకు ప్రారంభించారో ఆయనకి అత్యంత ఆప్తులైన మాస్టర్ రాంపిళ్ల శ్రీనివాస్(9849482713)దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో మనందరికీ తెలియ చేయగలరా అని ప్రశ్నించారు.అలా అయితే, మన కమ్యూనిటీ హక్కులు, ఉనికి, విజయవాడ పశ్చిమంపై మన పట్టును కాపాడుకోవడానికి తగిన వ్యూహంతో ముందుకు సాగగలమని వివరించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News