Kaizer News

డబ్బులిస్తే మీసేవ!

· State - Telangana · sakshi.com

కోర్టు కేసుల కారణంగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన మీసేవా కేంద్రాల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్‌ మండలాలకు సంబంధించిన కోర్టు కేసులు ఇటీవల పరిష్కారమయ్యాయి. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న అనంతరం త్వరలోనే ఐదు మండలాల్లోని అభ్యర్థులకు ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాతపరీక్ష పూర్తయింది. దరఖాస్తుదారులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఐదు మండలాల్లో ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఉద్యోగం, ఉపాధి ప్రకటన ఏది వచ్చినా.. కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామంటూ గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలతో పాటు కొత్త మీసేవా కేంద్రాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అదనుగా అక్రమార్కులు నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లాలోని ఐదు మండలాల్లో 8 నూతన మీసేవా కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. చౌటుప్పల్‌లో 3, సంస్థాన్‌ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్‌ (ఎం)లలో ఒక్కో కేంద్రం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. నూతన మీసేవా కేంద్రాల కేటాయింపును ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భారీగా దండుకుంటున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాల్లో ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికార పార్టీ నేతలమని, ఉన్నతాధికారులతో చెప్పించి మీసేవా కేంద్రం మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతూ ముందస్తుగా అడ్వాన్స్‌లు కూడా స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉపాధి లభిస్తుందన్న ఆశతో బాధితులు అప్పులు చేసి మరీ దళారులకు డబ్బులు సమర్పించుకుంటున్నారు. చేయిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న దళారులు ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?

Original source: sakshi.com
Read more on Kaizer News