Shorts రాయచోటి: రాయచోటి పట్టణం లోని పాత రాయచోటి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, సుగవాసి ప్రసాద్ బాబు గారు కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరుపుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జన ఊరేగింపులో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. చిన్నారులు, మహిళలు మరియు వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిమజ్జనం సమయంలో నీటి ప్రదేశాల వద్ద జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ తీగలు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలి. డీజేలు, బాణసంచా విషయంలో పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్యాన్ని తగ్గించే విధంగా నిమజ్జనం నిర్వహించాలి. భక్తులు పరస్పరం సహకరించుకుంటూ శాంతియుతంగా, సోదరభావంతో ఉత్సవాన్ని ముగించాలి. “వినాయకుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలి” అని సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు