Kaizer News

సీఎం పేరు మరిచిన పొన్నం

సీఎం పేరు మరిచిన పొన్నం

· State - Telangana · ntnews.com

ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటూ అసెంబ్లీలో ప్రసంగం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పేరును మంత్రి పొన్నం ప్రభాకర్‌ మర్చిపోయారు. ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటూ ప్రసంగం కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అసెంబ్లీలో ఎల్‌ నినోపై చర్చ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. వర్షాల కోసం యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి యాగాలు చేశారని తెలిపారు. వర్షాల కోసం ఎమ్మెల్యేలతో కొండగట్టులో తాము గిరి ప్రదక్షిణ చేసినట్టు గుర్తు చేశారు. ఎల్‌ నినో తెలంగాణ తెచ్చుకున్న సమస్య కాదని, పకృతి వైపరీత్యం అని ఈ అంశంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News