Shorts బి.కొత్తకోట: బి.కొత్తకోట నాయనిబావిలో ఆదివారం రాత్రి జరిగిన గొడవలో గౌరెడ్డి హత్యకు గురైన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు దారితీసిన కారణాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలపై ఆరా తీశారు. అనంతరం రాయచోటి నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి, హత్యకు దారితీసిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసు అధికారులకు డీఎస్పీ సూచించారు. హత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు