Kaizer News

P Gannavaram: పి.గన్నవరం అభివృద్ధికి రూ.1,232 కోట్

P Gannavaram: పి.గన్నవరం అభివృద్ధికి రూ.1,232 కోట్లు: ఎమ్మెల్యే గిడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబాజీపేట పర్యటన సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించి 22 కీలక అభివృద్ధి ప్రతిపాదనలను అధికారికంగా సమర్పించినట్లు తెలిపారు. Lr.No.1566/MLA/P.GANNAVARAM/2026, తేదీ 09-09-2026 ద్వారా సమర్పించిన ఈ ప్రతిపాదనల మొత్తం అంచనా విలువ రూ.1,232.67 కోట్లు అని వెల్లడించారు. ప్రచారం కోసం కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రతిపాదనల్లో ఫైర్ స్టేషన్ పెండింగ్ నిధులు, అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అమలాపురంలో Coconut Development Board State Centre, అప్పనపల్లి–ఐనవిల్లి–ఆదుర్రు ప్రాంతాలను సమగ్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, తొగరపాయ వద్ద సబ్మర్సిబుల్ బ్రిడ్జి, నాలుగు మండలాల్లో ఏటిగట్లపై BT రోడ్లు, 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఘాట్లు, ఆలయాలు, రహదారులు, వంతెనల అభివృద్ధి వంటి పలు అంశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే పి.గన్నవరం Community Health Centreను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, డ్రైనేజీ, సాగునీరు, వరద రక్షణ, విద్యుత్ మౌలిక వసతులు, మార్కెట్ యార్డులకు లింక్ రోడ్లు, కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు విద్యుత్ చార్జీల రాయితీ వంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అనుమతులు సాధించడం, నిధులు తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సమన్వయం చేయడం తన బాధ్యత అని అన్నారు. తాను విమర్శలకు మాటలతో కాకుండా పత్రాలతో, పనులతో సమాధానం చెబుతానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్పష్టం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులు, నిధులు, మౌలిక వసతులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పి.గన్నవరం అభివృద్ధి ఆగదని, ప్రజల కోసం తమ ప్రయాణం, అభివృద్ధి కోసం తమ కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News