పక్క రాష్ట్రాల నుంచి చేప పిల్లల కొనుగోలుకు ఏటా.. రూ.90 కోట్ల వ్యయం రాష్ట్రంలో 500 ఎకరాల్లో 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు 21 కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగానికి అనుకూలం.. ఏటా 120 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేసే సామర్థ్యం కానీ కొన్ని పరిమిత స్థాయిలోనే వినియోగం..ఆక్రమణల్లో మరికొన్ని సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ లోపంతో మత్స్యకారులకు సమస్యలు కాంట్రాక్టర్ల ద్వారా చేపల కొనుగోలుకు పదేళ్లలో రూ.900 కోట్ల వ్యయం టెండర్లలో అవినీతి, మత్స్యకారులకు నాణ్యత లేని చేప పిల్లల పంపిణీ ఆరోపణలు ఉత్పత్తి కేంద్రాలు పునరుద్ధరించి, ట్యాంకులకు మరమ్మతులు చేస్తే ఏటా రూ.70 కోట్లు ఆదా! (గౌటే దేవేందర్) రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తికి వీలుగా సహజసిద్ధమైన వనరులు ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ అధీనంలో భూములు, ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మత్స్యకారుల సహకార సంఘాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించే సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా అవసరమైన చేప పిల్లల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండటం, ఇందుకోసం టెండర్ల ఖరారులో జాప్యం, అవినీతి ఆరోపణలు, నాణ్యత లేని లేదా కల్తీ చేప పిల్లల పంపిణీ, సరైన సమయంలో చెరువుల్లోకి పిల్లలను వదలకపోవడం వంటి సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి. రాష్ట్రంలోనే వందల ఎకరాల్లో విస్తరించిన ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా పక్క రాష్ట్రాల నుంచి చేప పిల్లలను ఎందుకు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత పదేళ్లలో దాదాపు రూ.900 కోట్ల మేరకు ప్రభుత్వ నిధులు కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లల కొనుగోలుకు వెచి్చంచినట్లు అంచనాలు ఉన్నాయి. అంటే ఏటా సగటున రూ.90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒకవైపు భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తుండగా.. మరోవైపు రాష్ట్రంలోని సొంత ఉత్పత్తి కేంద్రాలు మాత్రం నిరుపయోగంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పునరుద్ధరణలో నిర్లక్ష్యం!: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో మొత్తం 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో 21 కేంద్రాలు చేప పిల్లల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని పరిమిత స్థాయిలో మాత్రమే ఉపయోగంలో ఉండగా, మరికొన్ని కేంద్రాలు సగం వరకు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇంకొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్ని కేంద్రాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ట్యాంకులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పునరుద్ధరించి వినియోగించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ కింద పోచంపాడులో 240కి పైగా ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 80 ట్యాంకుల్లో మాత్రమే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. మిగతా అనీ ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్థానంలో కరీంనగర్, మెదక్ ఉన్నాయి. ఈ కేంద్రాలు కేవలం పేరుకే ఉన్నవి కావు. వీటికి భారీ స్థాయిలో చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొత్తం దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉ