‘నమస్తే తెలంగాణ’ కథనాలతో టీటీడీ తొందరపాటు చర్యలు వేదపారాయణదారు పోస్టుల ఎంపికలో నిబంధనలకు పాతర వెంటనేఉద్యోగంలో చేరాలని అభ్యర్థులకు పంపుతున్న మెసేజ్‌లు ‘నమస్తే’ కథనాలతో ఏకమవుతున్న దేశంలోని వివిధ రాష్ర్టాల అభ్యర్థులు తెలంగాణ పండితుల పోరాటంలో కలిసి వస్తామంటూ సందేశాలు అర్హత లేనివారికి అవకాశాలు ఇచ్చారంటూ చైర్మన్‌పై ఆరోపణలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 29 (నమస్తే తెలంగాణ): టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ(ఎస్‌వీఐహెచ్‌వీఎస్) ద్వారా చేపట్టిన వేదపారాయణ పథకం కింద 791 పోస్టుల నియామక ప్రక్రియలో ఆంధ్రప్రాంతానికి పెద్దపీట వేసి మిగతా రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేశారంటూ తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వేదపండితులు చెప్తున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు వేదపారాయణదారుల నియామకాల్లో అవకతవకలపై హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు వస్తుండడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కోర్టు ఏదైనా స్టే లేదా ఆదేశాలు ఇవ్వకముందే నియామకప్రక్రియ ముగించేందుకు హడావుడి చేస్తున్నది. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి నియామకాలు చేపడుతామని ముందుగా షెడ్యూల్ ఇచ్చిన అధికారులు తాజాగా ఆ నిబంధనలను పక్కన పెట్టారు. వేదపారాయణదారు పోస్టులకు ఎంపికైనవారి ఫోన్లకు శుక్రవారం రాత్రి నుంచే మెసేజ్‌లు పంపి శని, ఆదివారాల్లో విధుల్లో చేరుతున్నట్టుగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలంటూ వాయిస్ రికార్డులు కూడా పెట్టారు. ఒకవేళ ఎవరికైనా అందకపోతే అభ్యర్థులు మిగతావారికి కూడా చెప్పండంటూ టీటీడీ నుంచి నేరుగా ఒక మహిళా ఉద్యోగి ఫోన్ చేసిన కాల్ రికార్డు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది.ఎటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్, దేవాలయాల ఎన్‌వోసీలు అవసరం లేదంటూ వెంటనే తిరుపతికి వచ్చి జాయినింగ్ రిపోర్టు చేస్తే ఆర్డర్లు ఇస్తామంటూ పేర్కొంటున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులని కూడా చూడకుండా ఆఫీసు తెరిచి ఉంచి ఆదివారంలోపే అందరికీ ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ప్రక్రియలో అవకతవకలు ఉండడం కారణంగానే తమపై వస్తున్న కథనాలు, కోర్టు ఉత్తర్వుల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని తెలంగాణ వేదపండితులు ఆరోపిస్తున్నారు. కొరవడిన పారదర్శకత.. చైర్మన్ జోక్యమే కారణం టీటీడీ వేదపారాయణ స్కీమ్‌కు సంబంధించి గతంలో ఎప్పుడూ పారదర్శకత పాటిస్తూనే వస్తున్నారు. ఈ నియామకాల ప్రక్రియలో ఎప్పుడూ స్థానికత అంశం తెరపైకి రాలేదు. అర్హులైన వారికి అందునా 85 శాతంపైగా మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆ నియామకాలకు సంబంధించిన వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టేవారు. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత తనవారికే ఉద్యోగాలు ఇప్పించుకోవడం మొదలుపెట్టినట్టు సమాచారం. వేదపారాయణదారుల పోస్టుల్లో కూడా ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఒక ఎన్నికకు సంబంధించిన ఖర్చును కొంతమేరకు భరించేలా కొందరు టీటీడీ పరీక్షాధికారులు మధ్యవర్తిత్వం చేసి ఒప్పించడంతో వారికి అర్హతలు లేకున్నా, మార్కులు రాకున్నా ఉద్యోగాలు ఇచ్చినట్టు టీటీడీకి చె