Kaizer News

Visakhapatnam: కేంద్ర కొలువు గర్వకారణం: కేంద్ర మంత

Visakhapatnam: కేంద్ర కొలువు గర్వకారణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

· State - Telangana · hmtvlive.com

Shorts Visakhapatnam: విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలోని కళావాణి ఆడిటోరియంలో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ సమావేశంలో భాగస్వామ్యం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించిన 51000 మందికి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం లో జరిగిన కార్యక్రమంలో 200 మందికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది మంది యువత ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి పోటీ వాతావరణంలో ఈరోజు ఉద్యోగాన్ని సాధించడం ఎంతో గొప్ప విజయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ విజయానికి వెనుక నిలిచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని యువతకు సూచించారు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News