Kaizer News

Gopalapuram: యర్నగూడెంలో వైఎస్సార్‌సీపీ సమీక్ష: తా

Gopalapuram: యర్నగూడెంలో వైఎస్సార్‌సీపీ సమీక్ష: తానేటి వనిత దిశానిర్దేశం

· State - Telangana · hmtvlive.com

Shorts Gopalapuram: గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఐడీ కార్డుల పంపిణీ, స్థానిక ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీమతి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, గ్రామాల వారీగా పార్టీ కార్యకలాపాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా తానేటి వనిత పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్‌తో పాటు దేవరపల్లి మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News