Kaizer News

విష వలయం.. ట్రామా బాండింగ్‌

విష వలయం.. ట్రామా బాండింగ్‌

· State - Telangana · ntnews.com

ఒక సినీనటి ఓ బంధంలో సైకలాజికల్‌గా ఎంతో ఇబ్బంది పడ్డానని, అందులో నుంచి బయటపడటానికి రెండేండ్లు పట్టిందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఆమె ఒక్కరే కాదు, ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్నే సైకాలజీలో ట్రామా బాండింగ్‌ అంటారు. దీని బారి నుంచి ఎందుకు అంత త్వరగా బయటపడలేరో, ఎలాంటి చర్యల ద్వారా బయటపడొచ్చో తెలుసుకుందాం. నార్సిసిస్టిక్‌ బంధాల్లో మహిళలు మానసిక లేదా శారీరక హింసకు, అప్పుడప్పుడు కురిపించే ప్రేమకు మధ్య నలిగిపోతూ ఉండే స్థితిలో ఏర్పడే అత్యంత విషపూరితమైన అనుబంధమే.. ‘ట్రామా బాండింగ్‌’. నార్సిసిస్టిక్‌ బంధంలో ఉన్న స్త్రీలలో ఈ ట్రామా బాండింగ్‌ ఎంత తీవ్రంగా పనిచేస్తుందో స్పష్టం చేసే కొన్ని ముఖ్యమైన మానసిక కోణాల గురించి తెలుసుకుందాం. ట్రామా బాండింగ్‌ కేవలం ఆలోచనలకు సంబంధించింది మాత్రమే కాదు, అది మెదడులోని రసాయన మార్పులతో ముడిపడి ఉంటుంది. భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు బాధితురాలి మెదడులో ‘కార్టిసోల్‌’ పెరుగుతుంది. అదే భాగస్వామి మళ్లీ సడన్‌గా అనురాగం చూపినప్పుడు ‘డోపమైన్‌’, ‘ఆక్సిటోసిన్‌’ విడుదల అవుతాయి. ఈ మార్పుల వల్ల ఆ స్త్రీ మెదడు, భాగస్వామి ఇచ్చే ఆ కాస్త అనురాగం కోసం తీవ్రంగా నిరీక్షించేలా అలవాటు పడుతుంది. ఇది ఒక రకమైన డ్రగ్‌ అడిక్షన్‌ లాగా మారుతుంది. బాధితురాలు బంధం తెంచుకోకపోవడానికి ప్రధాన కారణం భాగస్వామి నిలకడలేని ప్రవర్తన. భాగస్వామి ఎప్పుడూ చెడుగా ప్రవర్తిస్తే ఆ బంధం నుంచి బయటపడటం సులభం. కానీ, 90% హింసించి, 10% అత్యంత ఆప్యాయతగా ఉండటం వల్ల ‘అతను నిజానికి మంచివాడే, నేనే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు’ అనే భ్రమలో స్త్రీలు ఉండిపోతారు. నార్సిసిస్ట్‌ కలిగించిన మానసిక వేదన నుంచి ఉపశమనం పొందడానికి, బాధితురాలు మళ్లీ అదే నార్సిసిస్ట్‌ అనురాగం కోసం ప్రయత్నిస్తుంది. నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు కలిగే ఆందోళనను తగ్గించుకోవడానికి అతని కాళ్లావేళ్లా పడటం, అతని కోరికలకు లొంగిపోవడం ద్వారా శాంతిని వెతుక్కుంటుంది. దీనివల్ల అతనే బాధించేవాడు, అతనే రక్షకుడు అనే ఒక విచిత్రమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ట్రామా బాండింగ్‌లో ఉన్న స్త్రీలు తమ భాగస్వామి ప్రవర్తనను సమర్థించడం ప్రారంభిస్తారు. ‘అతనికి చిన్నప్పుడు సరైన పెంపకం లేదు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు’, ‘నేను ఆ మాట అనకుండా ఉంటే అతను అంతగా కోప్పడేవాడు కాదు’ ఇలా తనపై తాను తప్పు వేసుకుంటూ, అతణ్ని నిరపరాధిగా చూపించడానికి తన మనసులోనే రకరకాల కారణాలను సృష్టించుకుంటారు. కాలక్రమేణా బాధితురాలు తన సొంత ఇష్టాయిష్టాలు, లక్ష్యాలు, విలువలను పూర్తిగా మరచిపోతుంది. ఆమె ఆలోచనలన్నీ ‘భాగస్వామిని ఎలా సంతోషపెట్టాలి?’, ‘అతని కోపానికి గురికాకుండా ఎలా తప్పించుకోవాలి?’ అనే దాని చుట్టూనే తిరుగుతాయి. దీనివల్ల ఆమె స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోతారు. ట్రామా బాండింగ్‌ నుంచి బయటపడటం సాధ్యమే కానీ, కొంచెం కష్టం. వీలైనంత వరకు ఆ వ్యక్తితో మాట్లాడటం, కలవడం పూర్తిగా ఆపేయాలి. భాగస్వామి వల్ల ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన మానసిక వేదనను డైరీలో రాసుకుని, అసలు నిజాలు ఏమిటో ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి. సైకోథెరపీ ద్వారా మెదడులోని ఈ ఫిజియోలాజిక

Original source: ntnews.com
Read more on Kaizer News