Kaizer News

అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు.. 2

అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు.. 23 నుంచి 30 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్టోబర్ 11 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం టాస్ డైరెక్టర్ లింగయ్య షెడ్యూల్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు 11న ప్రారంభమై, 17 వరకూ కొనసాగుతాయని తెలిపారు. పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఉదయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సబ్జెక్టుల ప్రకారం తేదీలను చూసుకోవాలని సూచించారు. ఇంటర్​విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 23 నుంచి 30 వరకు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను గమనించాలని సొసైటీ డైరెక్టర్ లింగయ్య సూచించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News