Kaizer News

తలుపులు పగులగొట్టి క్రిశాంక్‌ అరెస్టు

తలుపులు పగులగొట్టి క్రిశాంక్‌ అరెస్టు

· State - Telangana · ntnews.com

నోటీసులు ఇస్తామని చెప్పి ఇంటిపై పోలీసుల దాడి ఆరు గంటలపాటు హడావుడి అక్రమ అరెస్టుపై బీఆర్‌ఎస్‌ నేతల మండిపాటు కంటోన్మెంట్‌, సెప్టెంబర్‌ 18: ఇనుప గ్రిల్స్‌ తొలగించడంతోపాటు ఇంటి ప్రధాన తలుపులు పగులగొట్టి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ, పీఆర్వోల అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియా, ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టులు పెట్టినట్టు ఆరోపిస్తూ శుక్రవారం తెల్లవారుజాము ఐదు గంటలకు క్రిశాంక్‌ ఇంటి వద్ద సీసీఎస్‌ పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు ఆరు గంటలపాటు హడావుడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గంటలపాటు ఇంటివద్దే కాపుకాసిన పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్తూ ఇనుపగ్రిల్‌కు ఉన్న తాళంతోపాటు ఇంటి ప్రధాన తలుపులు పగులగొట్టి మరీ క్రిశాంక్‌ను అరెస్టు చేశారు. దీంతో వందలాది మంది బీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రిశాంక్‌పై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని మండిపడ్డారు. రేవంత్‌ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడమే కాకుండా ఇంట్లో వాళ్లను కూడా బెదిరిస్తున్నారని మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు. పోలీసులు చేసిన దౌర్జన్యంతో తన ఏడేండ్ల కూతురు వణికిపోయిందని వాపోయారు. రేవంత్‌ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు

Original source: ntnews.com
Read more on Kaizer News