Kaizer News

Cheepurupalli: గుర్లలో ఘనంగా 'యువ చైతన్యం'.. ఎస్పీ

Cheepurupalli: గుర్లలో ఘనంగా 'యువ చైతన్యం'.. ఎస్పీ దామోదర్ స్ఫూర్తిదాయక సందేశం!

· State - Telangana · hmtvlive.com

Cheepurupalli: గ్రామీణ ప్రాంతాల్లో చైతన్య దీపం: గుర్లలో 'యువ చైతన్యం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ యువత పెడదోవ పట్టకుండా, సమాజంలో నేరాలను అరికట్టే లక్ష్యంతో విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆధ్వర్యంలో గుర్ల మండలం, గుర్లలో 'యువ చైతన్యం' కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ఎస్పీ యువతను, విద్యార్థులను, స్థానిక ప్రజలను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. సమాజంలో మహిళలు, చిన్నారులకు రక్షణ, గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వారి పట్ల వేధింపులు, హింసకు పాల్పడటం క్షమించరాని నేరమని హెచ్చరించారు. యువత జీవితాలను నాశనం చేస్తున్న మహమ్మారి గంజాయి, డ్రగ్స్. వీటిని సేవించడం, రవాణా చేయడం, విక్రయించడం చేస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని, జీవితం జైలు పాలవుతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 3. రోడ్డు భద్రత - "అమ్మ జన్మనిస్తే, హెల్మెట్ పునర్జన్మనిస్తుంది": ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ఇది మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు అని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, 'డిజిటల్ అరెస్ట్' వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ యాప్‌లు యువతను ఆర్థికంగా, మానసికంగా దివాలా తీయిస్తున్నాయని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సర్వస్వం కోల్పోవద్దని హితవు పలికారు. డబ్బు, కులం, మతం శాశ్వతం కాదని, నాణ్యమైన విద్య మాత్రమే మంచి భవిష్యత్తును, సమాజంలో గుర్తింపును ఇస్తుందని, విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ప్రతిజ్ఞ వాక్యాలు చదివి వినిపించగా, యువత, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలు మహిళల రక్షణకు అండగా ఉంటామని, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్‌లకు దూరంగా ఉంటామని, రోడ్డు భద్రత, సైబర్ భద్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.శంకరరావు, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు, పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News