Kaizer News

అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళం..

అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళం..

· State - Telangana · prabhanews.com

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి గన్నవరం మండలం ముస్తాబాద్‌ శివాలయం బజార్‌కు చెందిన జి. రాఘవేంద్ర ప్రసాద్‌–పద్మజ దంపతులు రూ.1,00,000 విరాళాన్ని సమర్పించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణగాంధీని కలిసి ఆయన సమక్షంలో విరాళాన్ని భక్తిపూర్వకంగా అందజేశారు. దాత దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణగాంధీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళానికి సంబంధించిన రసీదును దాతలకు అందజేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News