Hanumakonda: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముత్తారం గ్రామంలో 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగనుంది. 153 పెన్షన్లకు రూ.41.57 లక్షలు విడుదల చేస్తున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 271 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.45.43 లక్షల ప్రయోజనం కల్పించారు.mమహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 191 కుటుంబాలకు రూ.1.60 లక్షలు విడుదల చేశారు. 28 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.1.60 లక్షలు అందించారు. 12 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.1.17 కోట్లు విడుదల చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాలకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు అందించారు. హోటళ్లకు సైతం స్టీల్ గ్లాసులు అందించారు. 158 మంది రైతులకు రూ.1.35 కోట్ల రైతు రుణమాఫీ ప్రయోజనం కల్పించారు. 430 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.2.18 కోట్లు అందించారు. రైతు బీమా కింద మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించారు. నలుగురు రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.79,600 అందించారు. 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. 63 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామంలోని 422 రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. గ్రామ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 లక్షల పనులు పూర్తి చేశారు. అంగన్వాడీకి తాగునీటి సౌకర్యం కోసం రూ.1 లక్షతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. భూభారతి కార్యక్రమంలో భీమదేవరపల్లి అనంతరం ముత్తారం గ్రామంలో భూసర్వే చేపట్టనున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జల సిరి పథకం కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.6,500, పొలం కుంటకు రూ.1.30 లక్షలు అందిస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశా