Devjit Saikia : భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) భవితవ్యంపై వస్తున్న ఊగాహానాలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే అగార్కర్‌పై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న సైకియా.. దుబాయ్‌లో ఉండిపోయిన ఆసియా కప్ ట్రోఫీలు త్వరలోనే బీసీసీఐ కార్యాలయానికి వస్తాయని స్పష్టం చేశాడు. బీసీసీఐ 95వ వార్షిక సమావేశం అనంతరం కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో పలు విషయాలు వెల్లడించాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియనున్నందున త్వరలోనే నిర్ణయ తీసుకుంటామని ఆయన తెలిపాడు. ‘అగార్కర్ కాంట్రాక్టు ముగియడానికి ఇంకా సమయం ఉంది. క్రికెట్‌లో 15 రోజుల సమయం అనేది చాలా పెద్దది. సరైన సమయంలో మేము నిర్ణయం తీసుకుంటాం. మీకు కచ్చితంగా తెలియజేస్తాం’ అని పేర్కొన్న బీసీసీఐ కార్యదర్శి.. దుబాయ్‌లోనే ఉండిపోయిన ఆసియా కప్ ట్రోఫీలపైనా స్పందించారు. ‘ఎప్పుడు అనేది చెప్పలేను కానీ, మన జట్లు గెలుపొందిన రెండు ఆసియా కప్ ట్రోఫీలు బీసీసీఐ కార్యాలయానికి వచ్చేస్తాయి’ అని ఆయన చెప్పారు. ఇక భారత పురుషుల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సుభాదీప్ ఝోష్‌ను తాత్కాలిక కాలానికి నియమించామని, అతడి పనితీరును పరిశీలిస్తామని సైకియా వెల్లడించాడు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం.. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆపేయగా.. ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్‌ను తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. సూర్యకుమార్ యాదవ్ బృందం ట్రోఫీని తీసుకోలేదు. ఈమధ్యే శ్రీలంకను చిత్తు చేసి ఎనిమిదోసారి ఆసియా విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ కూడా నఖ్వీ రాకతో ట్రోఫీని అందుకోలేదు. దాంతో.. ఈ రెండు ట్రోఫీలు దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలి(ACC) ఛైర్మన్‌గా కొనసాగుతున్న మొహ్సిన్ నఖ్వీ పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. దాంతో.. ఆ తర్వాత దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయం నుంచి ఆసియా కప్ ట్రోఫీలను బీసీసీఐ స్వీకరించనుందని సమాచారం