Shorts Narsipatnam: నర్సీపట్నం ఎస్సీ కాలనీలో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8.30 గంటల వరకు పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా సుమారు 50 మంది పోలీసులతో పాటు ఈగల్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌కు చెందిన “బన్నీ” పాల్గొన్నారు. మొత్తం 230 ఇళ్లను తనిఖీ చేసి, 440 మందితో వివరాలు సేకరించారు. 8 అనుమానిత ఇళ్లు, ఓ పాత NDPS కేసు నిందితుడు, 5 మంది రౌడీషీటర్లు/సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు. అలాగే 31 బైక్‌లు, ఓ ఆటోను పరిశీలించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు