Kaizer News

షాడో సీసీఎల్‌ఏ.. బరితెగింపు..!

షాడో సీసీఎల్‌ఏ.. బరితెగింపు..!

· State - Telangana · ntnews.com

వివాదాల వేట.. కోట్లలో మేత భూకాసురులు! వివాదాలకు పరిష్కారం ముసుగులో కోట్లలో ఆట హద్దూ అదుపు లేకుండా భూముల దందా! రెండు గ్రామాల మధ్య ఉన్న భూ తగాదాల్లో వేలు దశాబ్దాల రెవెన్యూ పెండింగ్‌ కేసుల్లోకి రంగ ప్రవేశం గుట్టుచప్పుడు కాకుండా బిలాదాఖలు భూముల్లో పాగా నం.2 మంత్రి నేతృత్వంలో షాడో సీసీఎల్‌ఏ చేసే పని ఇదే తహసీల్‌, ఆర్డీవో ప్రొసీడింగ్స్‌ స్క్రిప్టు రెడీ ఫ్యాక్టరీ అక్కడే జనాన్ని 22ఏ ఊబిలోకి నెట్టి తెరవెనుక భారీ సర్దుబాట్లు భూ దందాల పరంపరలోనే తెరపైకి ‘నిషేధిత’ ఉచ్చు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలు ఒక్కసారిగా పరిష్కారానికి నోచుకుంటాయి. ఏ దిక్కూలేని భూములకు ప్రభుత్వ పెద్దలే పెద్ద దిక్కుగా మారుతారు. 30 ఏండ్ల కిందటి సీలింగ్‌ ఫైల్‌ నాలుగు నెలల్లో గట్టెక్కుతుంది. రెండు గ్రామాల సరిహద్దులోని కొన్ని భూములు ప్రభుత్వానివే అంటూ రాత్రికిరాత్రి హైడ్రాకు కల వస్తుంది.. ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ‘భూ భారతి’ ఇస్తున్న పరిష్కార చిట్కాలు అనుకున్నారా? అయితే మీరు పప్పులో కాదు.. తప్పులో కాలేసినట్టే! శూన్యం నుంచి కూడా కాసుల మూటలు సృష్టించగల కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేసినట్టే! నంబర్‌-2 మంత్రివర్యుల షాడో సీసీఎల్‌ఏ ఘనత ఇది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు వెంటనే పరిష్కారాన్ని కనుగొనాలనే పథకాన్ని కాంగ్రెస్‌ పెద్దలు అమలు చేస్తున్నరు. అందులో భాగంగానే రెండున్నరేండ్లుగా అనేక భూ కుంభకోణాలు తెరపైకి వచ్చినయ్‌. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సామాన్య జనాన్ని 22ఏ ఊబిలోకి నెట్టిన సర్కార్‌ పెద్దలు సందట్లో సడేమియాలా.. తెరవెనుక తమ కార్యాలను చక్కబెట్టుకుంటున్నరు. ‘ఈ పాపం అధికారులదే’నంటూ వాళ్లపైకి నెపం నెట్టి వేల కోట్ల విలువైన అసైన్డ్‌ భూములపై అనధికారిక ఒప్పందాలు చేసుకుంటూ సామాన్యుడి చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను ‘హారతి’ కర్పూరంలా చేసి పట్టా భూములుగా మార్చుకొనేందుకు పావులు కదుపుతున్నరు. హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పాలనను పక్కన పడేసి, రైతుల భూ సమస్యలను గాలికి వదిలేసి.. భూ దందాలతో జేబులు నింపుకోవడంపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ‘ముఖ్యులు’ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా భూ వివాదాలను వెంటనే పరిష్కరించే పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. నంబర్‌-2 మంత్రి కనుసన్నల్లో నడుస్తున్న షాడో సీసీఎల్‌ఏ రేయింబవళ్లు రెవెన్యూ రికార్డుల దుమ్ముదులిపి, వేల ఎకరాల కేసులను ముందు వేసుకున్నది. ఇందులో భాగంగానే రెండున్నరేండ్లుగా వందల ఎకరాల ప్రభుత్వ భూములు సర్కార్‌ పెద్దల ‘భూ హారతి’కి ఆవిరైపోతున్నాయి. అనేక భూ కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలు ఒకవంతైతే, ఎక్కువగా ప్రభుత్వం వర్సెస్‌ ప్రైవేట్‌ వ్యక్తుల మధ్య భూ వివాదాలు కావడం గమనార్హం. సర్కార్‌ పెద్దలు తెరవెనుక ప్రైవేట్‌ వ్యక్తులతో మిలాఖత్‌ అయ్యి ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తుల ధారాదత్తానికి సంబంధించి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలంలోని రావల్‌కోల్‌ సర్వేనంబర్‌ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల

Original source: ntnews.com
Read more on Kaizer News