Shorts కడియం: పితృ వియోగంతో బాధపడుతున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రత్నం అయ్యప్పను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పరామర్శించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామం లోని రత్నం అయ్యప్ప స్వగృహానికి విచ్చేసిన ఆయన, అయ్యప్ప తండ్రి రత్నం సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయ్యప్ప కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు