Shorts విజయవాడ: సెప్టెంబర్ 5న గౌరవ ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో భాగంగా ఉద్యోగుల సమస్యలైన పిఆర్సి కమిటి నియామకం, రెండు డిఏల మంజూరు, హెల్త్ కార్డుల కాంట్రిబ్యూషన్ చెల్లింపు, సరెండర్ లీవుల చెల్లింపు, హర్షదాయకమని, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీటికి కృషి చేసిన రాష్ట్ర సంఘ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణకు రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలియజేసింది. స్థానిక గాంధీనగర్ లోని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర సంఘం కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర సంఘం ఎన్జీవో నాయకులు హాజరై, ఈ నెలలో జరిగిన ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు, ఉద్యోగ డిమాండ్లపై చర్చించుట జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి సమావేశంలో హామీ ఇచ్చిన ప్రతి సమస్యకు ఉత్తర్వులు జారీ చేయించడం, వాటిని అమలు చేయించడం ఏపీఎన్జీజిఓ సంఘ ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల గురించి, పరిష్కారం చేయటం పై దృష్టి సారించాలని రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయం పడింది. రాష్ట్ర కార్యవర్గానికి అధ్యక్షత వహించిన అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగులకు ప్రధాన బాధ్యత వహిస్తున్న ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్ణయాత్మకమైన పాత్ర దశాబ్దాల తరబడి పోషిస్తుందని... ఇప్పుడు కూడా డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని సాధించడంలో అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ మంజూరు చేయడం వలన 4 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రెండు డి ఏ లు ఒకేసారి విడుదల చేయటం, వాటిని కూడా సెప్టెంబర్ నెల జీతం నుంచె అమలు చేసి, అక్టోబర్ 1వ తారీకునే చెల్లించేలాగా చేయటం మూదావహమని తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, మరియు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నేరుగా హెల్త్ ట్రస్ట్ కు బదిలీ చేయటం అనేది మంచి మార్పుకు సంకేతం అని, దీనివల్ల హెల్త్ కార్డుల ప్రక్రియ సరైన దారిలో పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 24 లక్షల మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు హెల్త్ కార్డుల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, ఆటోమేటిక్ అడ్వాన్ మెంట్ స్కీము అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని, మరియు త్వరలోనే పరిష్కరించాలని కోరామని, అతి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని తెలియజేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయాలని, మధ్యంతర భృతి కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. అలాగే డిసెంబర్ 12వ తారీఖున ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చల