Kaizer News

గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

· State - Telangana · ntnews.com

చుంచుపల్లి, ఆగ‌స్టు 29 : చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. విచారణలో తాము గంజాయి సేవిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రామవరం ప్రాంతానికి చెందిన వీరిపై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇద్దరిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు

Original source: ntnews.com
Read more on Kaizer News