Shorts అమలాపురం: జిల్లా కేంద్రమైన అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం (సెప్టెంబరు 21) జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు,మండల తహసీల్దార్ కార్యాలయాలు, అన్ని మున్సిపల్ కార్యాలయాలు గ్రామ,వార్డు సచివాలయాల్లో పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ సూచించారు.ఫీడ్‌బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు అన్ని కేంద్రాల్లో PGRS Citizen Feedback QR Code ఏర్పాటు చేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. అర్జీ పరిష్కారం అనంతరం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు.ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో లోపాలను గుర్తించి, వ్యవస్థను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. 1100కు ఫిర్యాదు చేయొచ్చు.పీజీఆర్ఎస్ కేంద్రాలకు రావడంతో పాటు ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ (meekosam.ap.gov.in) ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు.అలాగే 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా 300కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.ప్రజలు అందుబాటులో ఉన్న ఈ సేవలను వినియోగించుకుని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు