Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ ఇటీవల సిగ్నల్ వద్ద స్కూల్ కు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన 4 సంవత్సరాల విద్యార్థిని జైనబ్ ఫాతిమా కుటుంబ సభ్యుల ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.చిన్నారి జైనబ్ ఫాతిమా మృతి చాలా బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తాడ్కోల్ చౌరస్తా ను ఇరుకు గా చేసిన ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు. జైనబ్ ఫాతిమా కుటుంబానికి ఎక్స్ గ్రేసియా ఇప్పించి ఆదుకుంటామని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఆయన వెంట మహమ్మద్ ఎజాజ్,ఇలియాస్, అబ్దుల్ వహాబ్, కలిo తదితరులు ఉన్నారు