Kaizer News

కిషన్‌రెడ్డి పర్యటనకు ముందు వికారాబాద్ రైల్వే స్టే

కిషన్‌రెడ్డి పర్యటనకు ముందు వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిశీలన

· State - Telangana · prabhanews.com

సౌత్ సెంట్రల్ రైల్వే ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు తనిఖీ.. రూ.35 కోట్లతో ఆధునికీకరణ పనులు వికారాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ముత్యాల నాయుడు శనివారం పరిశీలించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి, ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, భద్రతా సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. దాదాపు రూ.35 కోట్ల వ్యయంతో వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ఎస్కలేటర్లు, ర్యాంపులు, లిఫ్ట్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న లిఫ్ట్‌తో పాటు అదనంగా మరో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రయాణికులు ఒకటో ప్లాట్‌ఫారం నుంచి రెండో, మూడో ప్లాట్‌ఫారాలకు సులభంగా చేరుకునేందుకు అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు పరిశీలించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News