Kaizer News

Tollywood : శ్రియాతో ఫస్ట్ మూవీ.. ఇష్టం సినిమా హీర

Tollywood : శ్రియాతో ఫస్ట్ మూవీ.. ఇష్టం సినిమా హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?

· Entertainment · tv9telugu.com

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రియా శరణ్ మొదటి చిత్రం ‘ఇష్టం’ (2001). రామోజీరావు నిర్మాణంలో, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో శ్రియ సరసన చరణ్ రెడ్డి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా ద్వారా వీరిద్దరికీ మంచి గుర్తింపు లభించినప్పటికీ, తదనంతర కాలంలో ఇద్దరి జీవిత ప్రయాణాలు భిన్నమైన మలుపులు తిరిగాయి. ‘ఇష్టం’ సినిమా తర్వాత శ్రియా శరణ్ స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోయింది. కానీ హీరో చరణ్ రెడ్డి మాత్రం మరే ఇతర సినిమాలోనూ నటించలేదు. వ్యక్తిగత జీవితంలో ఆయన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫేమ్ సుప్రియను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర విభేదాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్.. 2012 మార్చి 19న చరణ్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 36 సంవత్సరాలు. తీవ్రమైన గుండెనొప్పితో అపోలో ఆస్పత్రిలో చేరినప్పటికీ, చికిత్స ఫలించక మరణించారు. వైద్య పరీక్షలు , ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం, ఆయన తీవ్రమైన మద్యపాన అలవాటుకు బానిసకావడం వల్ల లివర్ దెబ్బతిని మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు.. ఒక మంచి కాన్సెప్ట్‌తో హీరోగా పరిచయమై, కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీకి దూరమై, చివరికి చిన్న వయస్సులోనే విషాదాంతంగా ముగిసిన చరణ్ రెడ్డి జీవితం టాలీవుడ్‌లో ఇప్పటికీ ఒక దిగ్భ్రాంతికరమైన విషయంగానే మిగిలిపోయింది. ఇష్టం సినిమా తర్వాత సుమారు 11 ఏళ్లకు అంటే 2012 మార్చి 19న చరణ్ రెడ్డి చనిపోయాడన్న వార్త ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్.. ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా

Original source: tv9telugu.com
Read more on Kaizer News