Kaizer News

సెమీస్‌కు టీమిండియా.. క్వార్టర్స్‌లో జపాన్‌పై ఏకపక

సెమీస్‌కు టీమిండియా.. క్వార్టర్స్‌లో జపాన్‌పై ఏకపక్ష విజయం

· National - India · ntnews.com

నిస్హిన్‌ (జపాన్‌): ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలిపోరులోనే అదరగొట్టింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్‌లో టీమిండియా.. 8 వికెట్ల తేడాతో జసాన్‌ను చిత్తుచేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు.. తెలుగమ్మాయి శ్రీచరణి (4/10), షెఫాలి వర్మ (2/13) దెబ్బకు 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు స్టాఫర్డ్‌ (25), హరున ఇవాసకి (10) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. మిగతా 9 మందిలో నలుగురు డకౌట్‌ కాగా మిగిలిన ఐదుగురు కలిపి 15 రన్స్‌ మాత్రమే చేయగలిగారు. బంతితో రాణించిన షెఫాలి బ్యాట్‌తో (15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్‌)నూ వీరవిహారం చేయడంతో లక్ష్యాన్ని భారత్‌ 5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 59 రన్స్‌ చేసింది. సెమీస్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన.. ఈనెల 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది

Original source: ntnews.com
Read more on Kaizer News