Kaizer News

140-jobs-singareni-dismissed-covid : కొవిద్ లెనే ప

140-jobs-singareni-dismissed-covid : కొవిద్ లెనే పీక కోశారు..! Andhra Prabha Exclusive Story

· State - Telangana · prabhanews.com

కొవిద్ లెనే పీక కోశారు..! Andhra Prabha Exclusive Story అది జాతీయ విపత్తు మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ తీసిన విపత్తు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించరాదని రాజ్యాంగ వ్యవస్థల ఆదేశాలు ఉన్నా పెడచెవిన పెట్టారు సింగరేణి అధికారులు. కొవిద్ గివిద్ జాన్తా నహి అన్నట్లు బొగ్గు గని కార్మికుల కొలువుల పీక కోసేశారు. ఏకంగా 140 మంది ఉపాధి ఉసురు తీసి వారి బతుకుల్లో చీకట్లు నింపారు. ఐదేళ్ళుగా నానా తంటాలు పడుతూ.. కుటుంబ పోషణ భారం మోయలేక తల్లడిల్లుతున్న దారుణమైన పరిస్థితి మాజీ కార్మికులది. వన్ టైం సెటిల్ మెంట్ కింద తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని అగ్రిమెంట్ జరిగినా.. నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ తమ నిర్వాకాన్ని చాటుకోవడానికే సరిపోతున్నారు. సంస్థ గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో వచ్చే ఆరో తేదీన‌‌‌ జరిగే స్ట్రక్చర్ సమావేశాల పైనే బాధిత కార్మికులు ఆశలు పెట్టుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ ఉద్యోగులను ఇష్టానుసారంగా డిస్మిస్ చేయడానికి సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వలేదు. ఇదే సమయంలో అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మార్చి 29, 2020న ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం 140 మంది కార్మికులను గైర్హాజరు పేరిట ఉద్యోగాల్లోంచి తీసేసింది. వివాదాలు, ఉద్యోగుల తొలగింపుకు విపత్తు నిర్వహణ చట్టం, 2005, సెక్షన్ – 10(2)(l) సాధారణ లేబర్ చట్టాలు వర్తిస్తుంది. కోవిడ్-19 అనేది ఒక విపత్తుగా పరిగణించ బడినందున, పాత చట్టమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ -2005 ద్వారానే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న 2020, 2021 సంవత్సరాల్లో ఈ చట్టం కింద జారీ చేసిన నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమల్లో ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపుకు ‘ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, – 1947′ లేదా రాష్ట్రాల’ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్’ వర్తిస్తాయనే అంశాన్ని విస్మరించి డిస్మిస్ చేయడం పట్ల అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. గైర్హాజరు పేరిట కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించడం సముచితం కాదని తెలిసినా.. యాజమాన్యం కఠిన వైఖరే అవలంభించింది. ఈ తొలగింపు అక్రమమని జాతీయ కార్మిక సంఘాలు గగ్గోలు పెట్టినందునే యాజమాన్యం తిరిగి ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. వన్ టైం సెటిల్ మెంట్ కింద అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ నేటికీ ఆ నిర్ణయాలు అమలు బాట పెట్టలేదు సరికదా.. పదేపదే స్ట్రక్చర్ సమావేశాల చర్చల వరకు లాక్కొస్తుండడం ఆగ్రహానికి గురి చేస్తోంది. రెండు నెలల క్రితం ఆర్ఎల్సీ(రీజియన్ లేబర్ కమిషనర్) సమక్షంలో ప్రస్తావన కాదుకదా ఆ డిమాండ్ నే పడకేయించారు. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ – 10(2)(l) ప్రకారం లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదలైనా.. యజమానులు తమ కార్మికులకు, ఉద్యోగులకు ఎటువంటి జీతాల తగ్గింపు లేకుండా పూర్తి వేతనాలు చెల్లించాల్సి ఉందని వెల్లడించినా షరామామూలే అయ్యింది. ఇటీవల సమ్మె నోటీసు సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీతో యాజమాన్యం

Original source: prabhanews.com
Read more on Kaizer News