Kaizer News

‘బాబుకు డైవర్షన్‌ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య

‘బాబుకు డైవర్షన్‌ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య’

· State - Telangana · sakshi.com

సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబుకు డైవర్షన్‌ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డు నెయ్యి విషయంలో సైతం ఈడీ రిపోర్ట్ అనంతరం బొక్కబోర్ల పడ్డాడు. అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపు, సూపర్ సిక్స్ ఫ్లాప్ వీటన్నింటినీ డైవర్షన్ చేసే కట్టు కథ ప్రారంభించాడు. జరగని లిక్కర్ స్కామ్‌ను సత్యప్రసాద్ చేత మాట్లాడించి కొత్త డ్రామాకు తెరలేపాడు’’ అంటూ కాకాణి మండిపడ్డారు. ‘‘..లిక్కర్ స్కామ్ మొదట్లో చంద్రబాబు లక్ష కోట్లు అని ప్రారంభించి.. పవన్ 44 కోట్లు అని చెప్పి, అసెంబ్లీలో 18 కోట్లు అనడం.. చివరికి సిట్ చేత 3 వేల‌ కోట్లు అని చెప్పించిన తీరు చూశాం. సత్యప్రసాద్ అనే ఒక చిన్న స్థాయి ఉద్యోగిని అడ్డం పెట్టి మీరు ఆడుతున్న హై డ్రామా ప్రజలకు అర్థమవుతుంది. ఆఖరికి సిట్ దర్యాప్తుపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన మార్పు రాలేదు. లిక్కర్ స్కామ్ వాస్తవానికి చంద్రబాబు సృష్టించబడిన రీల్ స్కామ్. మొత్తం వ్యవస్థలను చేతిలోకి తీసుకొని భష్టుపట్టించడం తప్ప మరొకటి కాదు ..ట్రీట్మెంట్ తీసుకుంటున్న మతిస్థిమితం లేని సత్యప్రసాద్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ కథ నడుపుతున్నారు. ఒక నకిలీ స్కామ్‌ను సృష్టించి దాని నమ్మించాలని చూడటం ఇకనైనా చంద్రబాబు మానుకోవాలి. ఎక్కుడా ఆధారాలతో కూడిన స్పష్టమైన విచారణ జరగడం లేదు. సత్యప్రసాద్‌ను బెదిరించో, భయపెట్టో అప్రూవర్‌ మార్చి వైఎస్‌ జగన్‌పై మాట్లాడించిన తీరు హేయం ..వైఎస్‌ జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు ద్వారా నేరుగా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం జరిగింది. ఈ నకిలీ లిక్కర్ కేసులో మొదటి నుండి విచారణ, ఆధారాలు అన్నింటా మతలబులే.. చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా వైన్స్, పర్మీట్ రూమ్స్, బెల్ట్ షాపులు ఊరువాడ కనబడుతున్నాయి. బాబు లిక్కర్ అమ్మకాలను ప్రైవేటు పరం చేసి ఒక వైపు లంచాలు రూపంలో మరో వైపు కమిషన్స్ రూపంలో దోచేస్తున్నారు. 2014-19 మద్య జరిగిన స్కామ్‌పై ఫిర్యాదు ఇస్తే దానిని మాఫీ చేయించుకున్న ఘనుడు బాబు. ..వైఎస్‌ జగన్ హయాంలో నాణ్యమైన, పారదర్శకమైన అమ్మకాలు జరిగాయనడానికి అనేక ఆధారాలు వున్నాయి. చంద్రబాబు.. ఇవాళ నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు. రాబోయే రోజుల్లో నీ అవినీతి, కుంభకోణాలు కచ్చితంగా వెలికి తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం తథ్యం’’ అని కాకాణి తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: ‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’ కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News