Kaizer News

Chirala: ఆకురౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Chirala: ఆకురౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

· State - Telangana · hmtvlive.com

చీరాల: చీరాల నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తున్న ఆకురౌడీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నివాసముంటున్నా చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై జరిగిన దాడిని ఆమంచి ఖండించారు. గత కొన్ని నెలలుగా చీరాలలో రౌడీ ఇజం పెరిగిపోయిందని ఆమంచి స్పష్టం చేశారు. ఇష్టాను సారంగా దాడులకు పాల్పడుతున్న ఇటువంటి వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావటం లేదని ఆమంచి అన్నారు. రౌడీల సంసృతిని పోలీసులు కచ్చితంగా అరికట్టాలన్నారు. లక్ష్మీనారాయణ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమంచి డిమాండ్ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News