Kaizer News

మన్నెంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

మన్నెంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

· State - Telangana · prabhanews.com

నోటీసులు ఇవ్వకుండానే పాత గ్రామపంచాయతీ భ‌వ‌నం కూల్చివేత అధికారుల‌ను అడ్డుకున్న స‌ర్పంచ్‌, పాల‌క‌వ‌ర్గం తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చేందుకు అధికారులు రావడంతో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చడానికి రావడాన్ని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొన్నం సునీత మాట్లాడుతూ.. ఎటువంటి ప్రొసీజర్ పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామ అవసరాల కోసం పాత కార్యాలయాన్నే వాడుకోవాలని గతంలో చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులు భారీ బందోబస్తుతో వచ్చిన అధికారులతో పాలకవర్గం, గ్రామస్తుల‌తో వాగ్వాదానికి దిగారు. తోపులాట.. బలవంతంగా కూల్చివేత అధికారులు, పోలీసులకు పాలకవర్గానికి మధ్య జరిగిన తోపులాటలో పాత గ్రామపంచాయతీ భవనాన్ని జేసీబీతో బలవంతంగా కూల్చివేశారు. ఈ నిరసనలో భాగంగా సర్పంచ్ సునీత భర్త పొన్నం అనిల్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News