Kaizer News

AP | మూడు నెలల్లో బస్తా మీద రూ. 500 పెరుగుదల

AP | మూడు నెలల్లో బస్తా మీద రూ. 500 పెరుగుదల

· State - Telangana · prabhanews.com

మూడు నెలల్లో బస్తా మీద రూ. 500 పెరుగుదల భారీగా పడిపోయిన బియ్యం వ్యాపారం లోకల్ బ్రాండ్లను కొంటున్న హోటల్ యాజమాన్యాలు AP | (చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : ఒకవైపు రేషన్‌లో ఇచ్చే బియ్యం నాణ్యతపై అసంతృప్తి.. మరోవైపు మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు సామాన్యులకు అందనంతగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అన్నం వండుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల వ్యవధిలోనే బియ్యం బస్తా ధరలు భారీగా పెరగడంతో నెలవారీ కుటుంబ ఖర్చుల్లో బియ్యానికే అదనంగా వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రూ.1,000 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,500కు చేరడంతో ఒక్క బస్తాపైనే రూ.500 అదనపు భారం పడుతోంది. క్వింటాల్ బియ్యం ధర కూడా సుమారు రూ.2,000 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఇంట్లో నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు రెండు బస్తాల బియ్యం కొనుగోలు చేస్తే మూడు నెలల క్రితంతో పోలిస్తే నెలకు సుమారు రూ.1,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాలకు ఈ అదనపు ఖర్చు చిన్న విషయం కాదు. బియ్యం కొనాలంటే ఇతర ఇంటి అవసరాలను తగ్గించుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. బుల్లెట్ రైస్, బీబీటీ, ఆరున్నరలు, హెచ్‌ఎంటీ కోలం, నెల్లూరు సన్నాలు, కర్నూలు సన్నాలు వంటి రకాల ధరలు మూడు నెలల క్రితం రూ.1,000 నుంచి రూ.1,300 వరకు ఉండగా ప్రస్తుతం సుమారు రూ.2,000కు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే సన్న నూకల ధర కూడా రూ.750 నుంచి రూ.950కు పెరిగిన తరువాత ప్రస్తుతం కొన్ని రకాల బస్తా ధర రూ.2,500 వరకు చేరింది. ఇడ్లీ బియ్యం ధర కూడా బస్తాకు రూ.1,000 నుంచి రూ.1,800కు పెరిగింది. దీంతో ఇంట్లో వంటకే కాకుండా అల్పాహార కేంద్రాలు, చిన్న హోటళ్లపై కూడా భారం పడుతోంది. బియ్యం ధరలు పెరగడానికి రాష్ట్రవ్యాప్తంగా వరి ఉత్పత్తి తగ్గడం, స్థానికంగా సరఫరా తగ్గడం వంటి పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, నీటి లభ్యతలో ఇబ్బందులు కూడా వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరి సాగు తగ్గుతున్న పరిస్థితి ఉందని, కొందరు రైతులు వరికి బదులుగా ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, పత్తి, పొగాకు వంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు మిర్యాలగూడ, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం తదితర ప్రాంతాల నుంచి బియ్యం సరఫరా అవుతోంది. నూకలు గుంటూరు ప్రాంతం నుంచి వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు. స్థానికంగా లభించే బియ్యం కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరాపైనే మార్కెట్ ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండటంతో సరఫరాలో చిన్నపాటి అంతరాయం ఏర్పడినా ధరలపై ప్రభావం పడే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. బియ్యం ధరలు పెరగడంతో మార్కెట్‌లో కొను

Original source: prabhanews.com
Read more on Kaizer News