Kaizer News

Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్..

Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..

· National - India · telugu.abplive.com

ఆసియా క్రీడలు 2026లో ఇండియా తన పతకాల ఖాతాను ఘనంగా తెరిచింది. ముఖ్యంగా మహిళా షూటర్ పది మీటరల్ ఏయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ ఇలావేనిల్ వలరివన్ డబుల్ ధమాకా సాధించింది. అటు వ్యక్తిగత సిల్వర్ తోపాటు, ఇటు టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఆదివారం ముందుగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్ల త్రయం సోనమ్ మస్కార్, ఇలవేనిల్ వలరివన్, విదర్స్ వినోద్ అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని ద‌క్కించుక‌న్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ రౌండ్ ముగిసే సమయానికి భారత జట్టు మొత్తం 1898.0 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు 1904.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని బంగారు పతకాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఆఖరి క్షణం వరకు మెడల్ రేసులో నిలిచిన దక్షిణ కొరియా జట్టుకు ఆ దేశ షూటర్ చూ యెన్‌బెయోల్ ఆఖరి సిరీస్‌లో పేలవమైన షాట్లు కొట్టడంతో ఊహించని షాక్ తగిలింది. దీంతో ఆతిథ్య జపాన్ 1897.1 స్కోరుతో కాంస్య పతకాన్ని ఎగరేసుకుపోగా, కొరియా 1895.8 పాయింట్లతో నాలుగో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఇండియా తరఫున సోనమ్ మస్కార్ అత్యుత్తమ ప్రదర్శనతో 634.1 స్కోరు నమోదు చేసి వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 633.5 స్కోరు సాధించింది. ఇక వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ సిల్వర్ మెడల్ సాధించింది. జపాన్ కు చెందిన తైచి హినాటకు గోల్డ్, సౌత్ కొరియాకు చెందిన బాన్ హయోజిన్ కు కాంస్యం దక్కింది. ప‌త‌కం ఖాయం.. అధికారికంగా 2026 ఆసియా క్రీడల్లో సోనమ్ మస్కార్, ఇలవేనిల్ వలరివన్, విదర్స్ వినోద్‌ల బృందం తొలి పతకాన్ని దేశానికి అందించింది. అయితే అంతకుముందే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సూచిక తరియాల్ మహిళల 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తాజా రజతంతో షూటింగ్ విభాగంలో ఇండియా సరికొత్త ఉత్సాహంతో వేటను మొదలుపెట్టింది. గత 2022 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో మొత్తం 22 పతకాలు సాధించి చరిత్ర నెల‌కొల్పారు. ఈసారి ఆ రికార్డును అధిగమించాలని భారత షూటింగ్ బృందం పట్టుదలతో ఉంది. పతకాల పట్టికలో ఆరో స్థానం.. జపాన్‌ ఆధిపత్యం రెండు పతకాలు సాధించడంతో భారత్ ప్రస్తుతం ఆసియా క్రీడల పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. జపాన్అ గ్రస్థానంలో కొనసాగుతుండగా, చైనా రెండో స్థానంలో ఉంది. మకావు, దక్షిణ కొరియా, కజకిస్తాన్ జట్లు ప్రస్తుతం పట్టికలో భారత్ కంటే పైస్థానాల్లో ఉన్నాయి. రాబోయే ఈవెంట్లలో పతకాల జోరు.. భారత్ ముందడుగు తొలి రోజే షూటింగ్‌లో పతకం దక్కడంతో భారత క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. రాబోయే రోజుల్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో మరిన్ని పతకాలు సాధించి టేబుల్‌లో టాప్ స్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. (IST) Tags : SILVER MEDAL Asian Games Sonam Maskar Elavenil Valarivan Shooting Team Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul ke, sab bhool ke - only on Games Live --> Advertisement టాప్ హెడ్ లైన్స్ ఆట ఇండియా సిరీస్‌కు వెస్టిండీస్ భారీ స

Original source: telugu.abplive.com
Read more on Kaizer News