Kaizer News

ఒకవైపే చూస్తున్న నాలుగో సింహం.. పోలీసుల చూపు కేవలం

ఒకవైపే చూస్తున్న నాలుగో సింహం.. పోలీసుల చూపు కేవలం మంత్రి మాజీ ఓఎస్డీపైనే

· State - Telangana · ntnews.com

అరెస్టు చేస్తామనడం తప్ప లోతైన దర్యాప్తు శూన్యం ఆ కేసు వెనుక కూడా ఎన్‌వోసీలు, భూదందాలే కొండా మాజీ ఓఎస్డీ సుమంత్‌ కేసులో సంచలన విషయాలు హరికృష్ణ వసూళ్లపై ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు నెల కావస్తున్నా ఫిర్యాదుపై ఊసేలేని విచారణ హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఆగస్ట్‌ 28 (నమస్తే తెలంగాణ) : నాలుగో సింహం ఒకవైపే చూస్తున్నదా? మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ వ్యవహారంలో పోలీసుల చూపు కేవలం అతడిపైనే ఉన్నది. ఎంతసేపూ సుమంత్‌, అతడితో ఉన్న ఇతరులను అరెస్ట్‌ చేస్తామని చెప్తున్నారే తప్ప అసలు జరిగిన వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జరిగింది ఒకటైతే పోలీసులు చేస్తున్నది మరొకటి అంటూ ఈ వ్యవహారం మొత్తం తెలిసినవారు సన్నిహితుల వద్ద చెవులుకొరుక్కుంటున్నారు. గత నెల 30న తనపై సుమంత్‌ మరికొందరితో కలిసి దాడి చేశారంటూ ఈ నెల 20న మేడిపల్లి పీఎస్‌లో గొంగిడి హరికృష్ణ చేసిన ఫిర్యాదులో తనతో పాటు ఉన్నారంటూ చెప్పిన ఆ కిరణ్‌ ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ మొదలైంది? అసలు దీని వెనుక ఎవరున్నారు? అనేది నిశితంగా పరిశీలిస్తే సుమంత్‌ వ్యవహారం కూడా భూదందా చుట్టే తిరుగుతున్నది. అటవీ భూములకు ఎన్‌వోసీలు ఇప్పిస్తాననడం, వివాదాస్పద భూముల వ్యవహారాలు గట్టెక్కిస్తానని చెప్పి తమ రాజకీయ పలుకుబడితో అధికారులు, అన్ని వర్గాలను మభ్యపెడుతున్న తీరు ఈ కేసులో స్పష్టంగా వెలుగుచూస్తున్నది. సుమారు పదిహేను గంటల పాటు అంటే ఒకరాత్రి నుంచి తెల్లవారి మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఆధారాలు తమకు తెలిసినా బయటకు రానీయకుండా ఈ కేసు వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరనేది కూడా రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. జూలై 30న సుమంత్‌ తనపై దాడి చేశారంటున్న హరికృష్ణ ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారనేదానిపై ఆయన చెప్తున్న కారణాలు విచిత్రంగా ఉన్నా.. అసలు ఫిర్యాదు చేసే సమయంలో తనతో పాటు వచ్చిన కిరణ్‌కు, ఈ కేసుకు ఏం సంబంధమంటూ వారి వ్యతిరేకవర్గం ఆరా తీసింది. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహిత కోటరీలో వ్యక్తిగా, గతంలో రేవంత్‌ పీఏగా పనిచేసి ఆ తర్వాత రేవంత్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకొనే అతి సన్నిహిత వర్గాల్లో ఒకరుగా ఉంటున్న కిరణ్‌కు, హరికృష్ణకు ఏం సంబంధమంటే అది వారే చెప్పాలంటూ పోలీసుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసు వ్యవహారంలోనే జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ సస్పెన్షన్‌ వ్యవహారంపై దృష్టి మరల్చడంలో భాగమేనంటూ కమిషనరేట్‌లో మాట్లాడుకుంటున్నారు. పీఎస్‌లో 15 గంటలు హరికృష్ణ ఉంటే ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టకపోవడానికి కారణాలు, అసలు సుమంత్‌ను సముదాయించిన అధికారులెవరనే దిశగా పోలీసు వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఈగొడవకు పదికోట్లకు పైగా వసూళ్లే కారణమని, అవి కూడా మంత్రి కొండా, సుమంత్‌ పేరు చెప్పి అటవీ భూములకు ఎన్‌వోసీలు ఇవ్వడం, ఇతర వ్యవహారాలేనని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ. అసలు జరిగింది ఒకటైతే, జరుగుతున్నది మరొకటని, ఈ విషయంలో హరికృష్ణ వసూళ్లను పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముఖ్యనేత ఆంతరంగికుడుగా

Original source: ntnews.com
Read more on Kaizer News