Kaizer News

Siddipet: కాంగ్రెస్ ఫామ్‌హౌస్ రాజకీయాలు: ఉమేష్ చంద

Siddipet: కాంగ్రెస్ ఫామ్‌హౌస్ రాజకీయాలు: ఉమేష్ చంద్ర!

· State - Telangana · hmtvlive.com

Shorts Siddipet: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అబద్ధమని తేలిపోవడంతో అది తట్టుకోలేక మతిపోయి లేని ఫామ్ హౌస్ లు సృష్టించి ఎలాంటి దుచర్యాలకు పాల్పడుతుండ్రు! రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, సాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయంలో ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని సర్పంచ్‌ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్ర అన్నారు. ఆదివారం చిన్నకోడూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సర్పంచ్ యాట యాదగిరి, తీపిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేట పరిధిలోని రంగా‌నాయకసాగర్ ప్రాంతంలో హరీశ్‌రావుకు సంబంధించిన వ్యవసాయ భూములను పరిశీలించడం రాజకీయ వివాదానికి దారితీసిందని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హరీశ్‌రావు భూముల విషయంలో అవకతవకలపై దర్యాప్తు కోరుతూ ఆరోపణలు చేశారు. కానీ హరీశ్‌రావు గారు మాత్రం తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని, తన భూములను ప్రత్యక్షంగా చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్న కాంగ్రెస్ అందుకు సమాధానం ఎందుకు చెప్పడంలేదు. ‘వ్యవసాయ భూమిని ఫామ్‌హౌస్‌గా చిత్రీకరించడం సరికాదు’ కాంగ్రెస్ నేతల పర్యటనపై స్పందించిన ఉమేష్ చంద్ర, వ్యవసాయ క్షేత్రం, ఫామ్‌హౌస్ మధ్య తేడాను ప్రజలకు వివరించాలని కోరారు. హరీశ్‌రావు వ్యవసాయ భూములపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు వాస్తవాల ఆధారంగా ఉన్నాయా లేదా అన్నది అధికారిక రికార్డులు, భూమి పత్రాలు, సంబంధిత శాఖల విచారణ ద్వారా తేల్చాలని ఆయన అన్నారు. విచారణ జరిపించాలనుకుంటే చట్టబద్ధమైన సంస్థల ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. రాజకీయ పర్యటనల ద్వారా హరీష్ రావు గారి పైన అబద్ధపు ఆరోపణలు చేయడం వల్ల వాస్తవాలు తేలవు” అని ఉమేష్ చంద్ర అన్నారు. “రైతులకు నీళ్లు, పంటలకు మద్దతు, పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం పని చేయకుండా. కెసిఆర్ హరీష్ రావు గార్ల పైన ఆరోపణలు చేయడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు” అని ఉమేష్ చంద్ర అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై హరీశ్‌రావు ఇప్పటికే తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయని, అవసరమైతే వాటిని పరిశీలించవచ్చని పేర్కొన్నారని ఉమేష్ చంద్ర గుర్తుచేశారు. హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని, ప్రభుత్వం ఏదైనా అక్రమం జరిగిందని భావిస్తే చట్టబద్ధమైన విచారణ జరిపించాలని ఆయన కోరారు. “రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం. కానీ వ్యక్తిగత ఆరోపణలకు ఆధారాలు ఉండాలి. వాస్తవాలు బయటపడాలంటే అధికారిక రికార్డులు, విచారణలు, న్యాయపరమైన ప్రక్రియలే ప్రమాణంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి” అని కాముని ఉమేష్ చంద్ర అన్నారు. లోకల్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెపాల్స

Original source: hmtvlive.com
Read more on Kaizer News