తెలంగాణ: కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో కొడుకు ఉరేసుకొని మృతిచెందిన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామంలో జరిగింది. ఆకునూర్‌కు చెందిన ఒజ్జ ఉప్పలయ్య సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఉప్పలయ్య మొదటి భార్యకు ఐదుగురు సంతానం. ఆమె చనిపోగా ఉమను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు ఒజ్జ హర్షవర్ధన్ (17). హుజూరాబాద్‌లో ఐటీఐ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో కాలేజీకి సరిగా వెళ్లడం లేదని తండ్రి ఉప్పలయ్య మందలించాడు. దీంతో హర్షవర్ధన్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: శంషాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా.. ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే