Kaizer News

CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

· State - Telangana · ntvtelugu.com

CM Revanth Reddy: తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచాలని ఈసీని కోరారు. రాష్ట్రంలో దాదాపు 73.39 లక్షల మంది (అంటే మొత్తం ఓటర్లలో 21.7%) 'అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్' (ASDD) జాబితాలోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రాఫ్ట్ రోల్‌లో రకరకాల లోపాలు, మ్యాపింగ్ లేకపోవడం వల్ల సగానికి పైగా ఓటర్లు మళ్లీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మొత్తంగా 92.86 లక్షల మందికి నోటీసులు అందాయని పేర్కొన్నారు. నమోదైన మొత్తం ASDD కేసుల్లో ఒక్క హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 58.6% కేసులు ఉన్నట్లు వెల్లడించారు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News