Kaizer News

జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష నిర్వహించాలి

· State - Telangana · sakshi.com

శ్రీరాంపూర్‌: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్ష వెంటనే నిర్వహించేలా యాజమాన్యంతో మాట్లాడాలని ఇంటర్నల్‌ అభ్యర్థులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును కోరా రు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 మార్చిలో ఈ పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థులతో భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు కూడా స్వీకరించారన్నారు. కానీ పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో తాము ఉద్యోగానికి చాలా రోజులుగా సెలవులు పెడుతూ ఈ పరీక్ష కోసం ప్రిపేర్‌ అవుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News