Kaizer News

Anakapalle: పవన్ కళ్యాణ్ జన్మదినం వేళ భారీ సేవా కా

Anakapalle: పవన్ కళ్యాణ్ జన్మదినం వేళ భారీ సేవా కార్యక్రమాలు!

· State - Telangana · hmtvlive.com

Anakapalle: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని చీడికాడ మండల కేంద్రంలో ఈరోజు చీడికాడ మండల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ అధ్యక్షుడు జీ వీ మూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మండలంలో జరపబోయే కార్యక్రమాల కోసం మరియు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాటు చేసి జనసేన పార్టీ బలంగా ఉన్నచోట బరిలో ఉంటామని తెలియజేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో రక్తదాన శిబిరం,తుని వలస గ్రామంలో అన్నదాన కార్యక్రమం,అలాగే దిబ్బపాలెం గ్రామంలో చనిపోయిన జనసైనికుడు కుటుంబానికి జనసైనికులు సేకరించిన నగదును అందించుట, బైలపూడి,మంచాల, అర్జునగిరి గ్రామంలో మొక్కల పంపిణీ మరియు ఇతర సేవా కార్యక్రమాలు, కండివరం గ్రామంలో దేశభక్తి గేయాలు పాటల పోటీ మరియు ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఫ్లెక్స్ మరియు కేక్ కటింగ్ లు జరిపి అధ్యక్షులు వారు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీడికాడ మండల పార్టీ కమిటీ సభ్యులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది

Original source: hmtvlive.com
Read more on Kaizer News