Kaizer News

Kadiyam: కడియంలో రైతులకు వ్యవసాయ వనరుల కిట్లు పంపి

Kadiyam: కడియంలో రైతులకు వ్యవసాయ వనరుల కిట్లు పంపిణీ

· State - Telangana · hmtvlive.com

Shorts కడియం: నేలలో సూక్ష్మజీవుల సాంద్రత పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ వనరులను అందజేస్తుందని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ అన్నారు. శనివారం, కడియం మండల పరిషత్ కార్యాలయంలో, ఎటిఎంఎ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) సౌజన్యంతో, వ్యవసాయ ఉద్యాన శాఖలు సంయుక్తంగా, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతులకు వ్యవసాయ వనరులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ వేప నూనె, నానో యూరియా, నానో డీఏపీ, సూక్ష్మ పోషకాలు 19-19-19, బయోచార్ లతో ఉన్న ఈ కిట్లను వాడడం వలన రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అలాగే రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తూ, సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు సాంద్రత పెరిగే విధంగా రైతులు చర్యలు చేపట్టాలని తెలిపారు. మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ వ్యవసాయ వనరులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ జెమీ, పంతం గణపతి, గట్టి నరసయ్య, నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, అధిమూలం సాయిబాబా, పుల్లా శ్రీను, చిలుకూరి ప్రభ, వ్యవసాయాధికారి పివి శ్రీనివాస్, ఉద్యానాధికారి సుధీర్ కుమార్, పలువురు రైతులు, ఆర్ఎస్కె సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News