Kaizer News

డ్రోన్ స్ప్రేయింగ్‌తో బంపర్ బెనిఫిట్స్!

డ్రోన్ స్ప్రేయింగ్‌తో బంపర్ బెనిఫిట్స్!

· State - Telangana · prabhanews.com

డ్రోన్ ద్వారా రైతన్నకు ఎంతో మేలు పది నిమిషాల్లోనే ఎకరం పూర్తి.. కూలీల కొరతకు చెక్.. మందు ఖర్చులో 30శాతం ఆదా.. డ్రోన్ వైపే మొగ్గు చూపుతున్న అన్నదాత! కమాన్ పూర్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు రైతులు పొలానికి మందు కొట్టాలంటే రైతు తెల్లవారుజామునే లేచేవారు.. 15 కిలోల డబ్బాను వీపున మోస్తూ.. బురదలో దిగుతూ.. జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ.. రోజంతా శ్రమించేవాడు. ఇప్పుడు సీన్ మారింది. రైతు గట్టు మీద నిలబడి, చేతిలో రిమోట్ పట్టుకుంటే చాలు.. ఆకాశంలో తిరిగే డ్రోన్ 10 నిమిషాల్లో ఎకరం పొలానికి మందు చల్లేస్తోంది. దీన్నే డ్రోన్ స్ప్రేయింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు.. ఈ పద్దతి ద్వారా కూలీల కొరతను అధిగమించడంతోపాటు మందుల ఖర్చులో 30 శాతం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు.. దీంతో అన్నదాత కూడా డ్రోన్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.. డ్రోన్లో 10 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఒకసారి ట్యాంక్ నింపితే ఎకరం పొలానికి సరిపోతుంది. జిపిఎస్తో అనుసంధానమై, పంట ఎత్తుకు 3 మీటర్ల పైన ఎగురుతూ, అతి సూక్ష్మంగా మందును చల్లుతుంది. మనిషి పిచికారీతో చల్లితే ఎకరాకు 200 లీటర్ల నీరు పడితే, డ్రోన్ తో కేవలం 10 లీటర్ల నీటితోనే పని పూర్తవుతుంది. కమాన్ పూర్ మండలం గుండారం రైతులు డ్రోస్ స్ప్రేయింగ్ పద్ధతిపై స్పందించారు. 5 ఎకరాల పత్తికి మందు కొట్టాలంటే ఇద్దరు కూలీలు, రెండు రోజులు పట్టేదని, రూ.3వేల ఖర్చయ్యేదని చెబుతున్నారు. ఇప్పుడు డ్రోన్ వాడితో మాట్లాడితే గంటలో 5 ఎకరాలు అయిపోయింది. ఎకరాకు రూ.500 మాత్రమే తీసుకున్నాడు. మందు కూడా తక్కువ పడిందని చెప్పారు.  ప్రధాన లాభాలివే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ కొనడానికి రైతు సంఘాలకు, ఎఫ్పిటలకు 50శాతం నుండి 75శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా కిసాన్ డ్రోన్ యోజన కింద శిక్షణ కూడా ఇస్తున్నారు. ఒక డ్రోన్ ధర రూ.7-8 లక్షలు ఉండగా, సబ్సిడీ పోను రూ.2.5 లక్షలకే వస్తోంది. చాలామంది యువ రైతులు డ్రోన్ కొని, ఎకరాకు రూ.500 చొప్పున అద్దెకు తిప్పుతూ నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలకు డ్రోన్ స్పేయింగ్ చాలా అనుకూలం. ముఖ్యంగా ఎత్తుగా పెరిగిన పంటల్లో మనిషి దిగలేని చోట డ్రోన్ అద్భుతంగా పనిచేస్తుంది. రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఎండనక, వాననక కష్టపడే రైతన్నకు డ్రోన్ టెక్నాలజీ నిజంగా వరంలాంటిదే. చేతిలో స్మార్ట్ ఫోన్, |ఆకాశంలో డ్రోన్.. ఇదే నేటి ఆధునిక వ్యవసాయం..! ప్రస్తుతం గ్రామాల్లో పొలాలకు, పత్తికి మందు పిచికారి చేయాలంటే ఒక రోజు గడిచేది. ప్రస్తుతం డ్రోన్లు రైతులకు పని భారం తగ్గిస్తున్నాయి. దీంతో మాకు కూడా పని భారం తగ్గి ఖర్చు కూడా తక్కువ వస్తుంది. చాలామంది రైతులం డ్రోన్ మిషిన్ల ద్వారానే పంట పొలాలకు మందు స్ప్రే చేయిస్తున్నాం

Original source: prabhanews.com
Read more on Kaizer News