Kaizer News

తిరగబడ్డ రైతు బిడ్డ

తిరగబడ్డ రైతు బిడ్డ

· State - Telangana · ntnews.com

నీళ్ల కోసం వారం రోజులుగా ఆందోళన.. ఉదయం నుంచి రాత్రి దాకా ధర్నా జూరాల గేట్లను ఎత్తి తామే నీటిని విడుదల చేసుకున్న అన్నదాతలు పంటలకు నీళ్లివ్వాలని డిమాండ్‌ పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాళాలు బద్దలుకొట్టి ఎడమ కాలువకు సాగునీటి విడుదల జూరాల గేట్లెత్తి నీటి విడుదల ప్రాజెక్టును దిగ్బంధించిన రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత హైదరాబాద్‌, సెప్టెంబర్‌19 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్‌, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంపై పాలమూరు రైతులు తిరుగబడ్డారు. పంటలెండుతున్నా పట్టించుకోని వైనంపై దండెత్తి జూరాల ప్రాజెక్టునే దిగ్బంధించారు. ప్రాజెక్టు తాళాలు బద్దలుకొట్టి ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ‘పంటలు ఎండిపోతున్నాయి నీటిని విడుదల చేయండి మహాప్రభూ’ అంటూ ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపుమండిన రైతాంగం ఏకమై గేట్లెత్తిన ఘటన కలకలం రేపింది. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు లేవని అధికారులు విడుదల చేయడంలేదు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో మొత్తం గేట్లను కుడి, ఎడమ కాలువలతోపాటు ప్రాజెక్టులకు నీటి విడుదలను నిలిపివేశారు. కొన్నిరోజుల నుంచి కృష్ణా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, కాలువలకు నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. సాగునీటిని విడుదల చేయాలని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ అధికారులకు 10 రోజులుగా విన్నవించుకుంటున్నా ఫలితం దక్కడంలేదు. దీంతో శనివారం 300 మంది రైతులు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎడమ కాలువ వద్దకు చేరుకుని తూము గేట్లను పైకెత్తే క్రమంలో తాళాలను బద్దలుకొట్టారు. ఎడమ కాలువ తూములు పైకెత్తడంతో ఒక్కసారిగా నీళ్లు కాలువలోకి దూకడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. గంటవరకు వేచి చూసి నా అధికారులు రాకపోవడంతో తూములను తెరిచి ఉంచి వెళ్లిపోయారు. గంటన్నర తర్వా త అధికారులు వచ్చి తూములను మూసివేయడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. జూరాల ఆయకట్టు కింద ఈసారి రైతాంగం పెద్ద ఎత్తున పంటలు సాగుచేసింది. కృష్ణా నదికి దాదాపు 50 రోజుల వరకు వరద నిరంతరాయంగా రావడంతో ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. నీళ్లొచ్చే సమయంలో కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా స్పిల్‌ వే గేట్లను తెరిచి శ్రీశైలానికి వదిలి వేసింది. కరెంటు లేదని, ఎత్తిపోయ లేమని, సర్కార్‌ ఆదేశాలు లేవని, క్యాబినెట్‌ అప్రూవల్‌ కావాలంటూ ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటిదాకా దాటవేస్తూ వచ్చారు. ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లి నీటిని దిగువకు వదిలి మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు పంటలు చేతికొచ్చే దశలో నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జూరాల ప్రాజెక్టు కిందనున్న గద్వాల, ఆత్మకూరు రైతాంగం సైతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. జూరాల ఆయకట్టు కింద నీటిని విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఎడమ కాలువ కింద సాగునీటిని విడుదల చేయాల

Original source: ntnews.com
Read more on Kaizer News