తణుకు: రిమాండ్ ఖైదీలు మత్తు పదార్దాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రెండో అదనపు మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.కృష్ణవేణి అన్నారు. తణుకు సబ్ జైలులో ఉన్న ముద్దాయిలకు చట్టాలపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మత్తు పానీయాలు సేవించడం వల్ల విశక్షణ కోల్పోయి క్షణికావేశంలో తప్పులు చేసి జైలుకి వస్తున్నారని తెలిపారు. చేసిన తప్పులు సరిద్దుకోవడం పోయి చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారని తెలిపారు. మత్తు పదార్ధాలు రవాణా చేయడం, అమ్మటం, తయారు చేయడం నేరమని పేర్కొన్నారు. ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్ళిన తరువాత మరల ఇక్కడకు రాకూడదని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, జైలు విజిటింగ్ న్యాయవాది అజయ్ కుమార్, పార లీగల్ వాలంటీర్ బ్రాహ్మజీ, జైలు సూపరింటెండెంట్ మోహన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు