Kaizer News

Karimnagar: ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?: బండి

Karimnagar: ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?: బండి సంజయ్

· State - Telangana · hmtvlive.com

Shorts కరీంనగర్ : కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫాంహౌజ్ భూముల సందర్శనకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ‘‘ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లడమేంది? ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారు? పాంహౌజ్ లో ఒకవేళ సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేంది?’’అని మండి పడ్డారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే డాక్యుమెంట్స్ తో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ పార్టీ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతల ఫాంహౌజ్ సందర్శన పెద్ద జోక్ కేసీఆర్ ఫాంహౌజ్ ఏమైనా టూరిజం కేంద్రమా?.ప్రైవేట్ భూములను సందర్శించడానికి మీకు అధికారం ఎక్కడిది. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్ భూములను సందర్శిస్తే అర్ధం చేసుకోవచ్చు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా.. ఫాంహౌజ్ లో ప్రభుత్వ భూములుంటే అధికారులను పంపి స్వాధీనం చేసుకోండి. వాటికి సంబంధించిన ఆధారాలను సీఎం బయటపెట్టాలి. 22ఏ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు 22ఏ ను తమకు అనుకూలంగా వాడుకున్నారు. 22ఏ సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతాం. అవసరమైతే న్యాయపరమైన పోరాటం చేస్తాం

Original source: hmtvlive.com
Read more on Kaizer News