Kaizer News

Ganesha Blessings : ఈయన అనుగ్రహం ఉంటే... ఈ అవ్వ వె

Ganesha Blessings : ఈయన అనుగ్రహం ఉంటే... ఈ అవ్వ వెళ్లినట్టే మనంకూడా కైలాసానికి వెళ్లొచ్చు

· State - Telangana · hmtvlive.com

Ganesha Blessings : విఘ్నాలను తొలగించి సకల విజయాలను ప్రసాదించే ఆదిదేవుడు శ్రీమహా గణపతి అనుగ్రహం ఉంటే మానవుడికి ఈ లోకంలోనే కాకుండా పరలోకంలోనూ అసాధ్యమైనది ఏదీ ఉండదు. తమిళనాడులో నివసించిన అవ్వయ్యార్ అనే వృద్ధ భక్తురాలి జీవితంలో జరిగిన పవిత్ర సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. యోగులందరి కంటే ముందే ఆ లంబోదరుడు తన తొండంతో ఎత్తి నేరుగా కైలాసానికి చేర్చిన ఈ దివ్య లీల, భక్తి సిద్ధాంతానికి, గణపతి అనుగ్రహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఏ పవిత్ర కార్యమైనా, నోములు, వ్రతాలైనా మొదలుపెట్టే ముందు మనం గణపతిని ధ్యానిస్తాం. "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్..." అనే దివ్య శ్లోకం స్వామివారి నాలుగు ప్రధాన దివ్య అలంకారాలను (తెల్లని వస్త్రాలు, సర్వాంతర్యామిత్వం, చంద్రకాంతి, చతుర్భుజాలు) కీర్తిస్తుంది. విఘ్ననాశకుడైన గణపతిని మనస్ఫూర్తిగా ఆరాధించే భక్తుల ఇంట ఆయన మేనత్త అయిన శ్రీలక్ష్మీదేవి కూడా స్థిరంగా కొలువై ఉంటుంది. అందుకే "లక్ష్మీగణపతయే నమః" అని నిత్యం స్మరిస్తారు. పూర్వం తమిళనాడులో అవ్వయ్యార్ అనే వృద్ధురాలు గణపతి పూజలో నిమగ్నమై ఉండేది. ఒకరోజు ఆమె తన గృహంలో ఏకాగ్రతతో వినాయక పూజ చేస్తుండగా, కొంతమంది యోగులు అక్కడికి వచ్చి ... "అవ్వా! మేమందరం కైలాసానికి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు వస్తావా?" అని అడిగారు. సాధారణ మానవులమైతే మోక్ష ప్రాప్తి కోసం వెనుకాడకుండా బయలుదేరతాం. కానీ ఆ భక్తురాలు మాత్రం... "నాకు కైలాస ప్రాప్తి కంటే ఇప్పుడు నేను చేస్తున్న గణపతి పూజే ముఖ్యం. ఈ పూజ పూర్తికాకుండా నేను ఎక్కడికీ రాలేను" అని నిష్కల్మషంగా జవాబిచ్చింది. దాంతో ఆ యోగులు ఆమెను విడిచిపెట్టి కైలాస మార్గాన వెళ్ళిపోయారు. ఆ యోగులు సుదీర్ఘ ప్రయాణం తర్వాత కైలాసం చేరుకునేసరికి, వారికంటే ముందే అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న అవ్వయ్యార్‌ను చూసి ఆశ్చర్యపోయారు. "మేము అడిగినప్పుడు రానన్నావు కదా! మాకంటే ముందే ఇక్కడికి ఎలా చేరుకున్నావు?" అని ప్రశ్నించగా ... "నా పూజ ముగియగానే, నేను పూజించిన వినాయకుడే తన తొండంతో నన్ను ఎత్తి క్షణకాలంలో ఈ కైలాసానికి చేర్చాడు" అని సమాధానమిచ్చింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ 'గణేశ భుజంగం' స్తోత్రంలో "గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే" అని ఉద్ఘాటించారు. అంటే సర్వాంతర్యామి అయిన గణపతి ప్రసన్నుడైతే ఈ విశ్వంలో పొందలేనిది, సాధించలేనిది ఏదీ ఉండదు అని అర్థం. నిశ్చలమైన భక్తితో, నియమనిష్టలతో గణపతిని ఆరాధిస్తే కష్టాలు తొలగిపోవడమే కాకుండా, అంతిమంగా దివ్యమైన మోక్షం ప్రాప్తిస్తుందని ఈ కథ మనకు బోధిస్తోంది. మనం కూడా నిర్మలమైన భక్తితో మనం నిత్యం పూజిస్తే కర్మబంధనాలు, భవభయాలు, విఘ్నాలు తొలగిపోతాయి. భూమిపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కంటే మరో కైలాసం ఏముంటుంది చెప్పండి. బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ ల

Original source: hmtvlive.com
Read more on Kaizer News