ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేసినట్లు ఉట్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత భర్త శ్రీనివాస్ జాదవ్ తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. వినతిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ జాదవ్ వెల్లడించారు. ఇందుకు మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు